దసరా పండుగ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరికో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మిచెట్టు లో బాగంగా కెపిఎచ్ బి లోని పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జమ్మిచెట్టు నాటారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
అనంతరం ఎమ్మెల్యే కృష్ణరావు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఊరు ఊరి కో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.ఈ రోజు ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జమ్మి చెట్టు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ హరితహారం, ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు,ఆలయ చైర్మన్ ,వైస్ చైర్మన్ ,ఆలయ పూజారులు,తదితరులు పాల్గొన్నారు.