గ్రేటర్‌లో రెండు రోజులు భారీ వర్షాలు..

108
Heavy rains
- Advertisement -

రెండు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు, కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది.

అవసరమైతే లోతట్టు ప్రాంతాలవారిని, పురాతన కట్టడాలకు సమీపంలో ఉన్నవారిని తరలించేందుకు 30 పునరావాస కేంద్రాలు, 170 మాన్సూన్‌ టీమ్‌లు, 92 స్టాటిస్టిక్స్‌ బృందాలను సిద్ధంచేశారు.

హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి, మూసీ నదిలోకి నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని బస్తీలు, కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు. గతంలో తెగిన చెరువుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -