ఐపీఎల్ 14వ సీజన్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా ముంబై మరోసారి నిరాశ పర్చింది. కోల్ కాత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ముంబై విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది కోల్ కతా.
రాహుల్ త్రిపాఠి (42 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. కోల్ కతా స్పిన్నర్ సునీల్ నరైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇక అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ డికాక్ (42 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా రోహిత్ శర్మ 30 బంతుల్లో 33 పరుగులు ,సూర్యకుమార్ యాదవ్ ( 5), ఇషాన్ కిషన్ ( 14 ), కృనాల్ పాండ్య ( 12 ) నిరాశపర్చారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.