- Advertisement -
ప్రజలు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిమజ్జనానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి… ఇందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు అధ్యక్ష, కార్యదర్శులు రాఘవ రెడ్డి, భగవంతరావు . ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జనం, శోభాయాత్ర నిర్వహించే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలి అనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు తలసాని.
- Advertisement -