ఈ మధ్య కొంత మంది సెలెబ్రిటీలు ఓ కొత్త్త రకం పద్దతిని ఫాలో అవుతున్నారు. ఆ పద్దతిని ఫాలో అవుతే..వారు అనుకున్నది జరుగుతుందో లేదో తెలిదు కానీ, వారి ప్రయత్నాలు మాత్రం ఆగట్లేదు. ఇంతకీ ఆ పద్దతి ఏంటి అనేగా మీ అనుమానం? .. అదే ప్లాస్టిక్ సర్జరి . ఈ సర్జరి చేయించుకుంటే అందం పెరుగుతుంది అని ఎవరు చెప్పారోగానీ.. అది కాస్త ఒక్కో సారి బెడిసికొడుతుందనటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.
ఇలాంటి పరిస్థితే జరిగింది బాలీవుడ్ భామ ఆయేషా టకియాకి. మరింత ఆకర్షణీయంగా.. అందంగా కనిపించాలని టకియా చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఆమె ఇలా గుర్తుపట్టలేనట్లుగా తయారైపోయింది. గత కొంత కాలంగా లైమ్ లైట్లో లేని టకియా.. ఉన్నట్లుండి ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఇలా కనిపించేసరికి జనాలు గుర్తుపట్టలేకపోయారు. నేను టకియా అని అందరికీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ..ప్లాస్టిక్ సర్జరీ పుణ్యమా అని ఆమె ముఖంలో రూపు రేఖలు అంతగా మారిపోయాయి మరి.
ముఖంలో ఏం అందం తగ్గిందనుకుందో ఏమో…ఈ భామ ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిందట. ఇక ఆమెకు ఎవరు సర్జరీ చేశారో కానీ.. అది కాస్త..బెడిసికొట్టింది. మరింత అందంగా తయారవ్వడం మాటేమో కానీ.. ఫేస్ కట్ మొత్తం మారిపోయి గుర్తుపట్టలేనట్లు తయారైపోయింది టకియా. సడెన్‌గా ఈ అమ్మాయిని చూపించి.. ‘సూపర్’ సినిమాలో నటించింది ఈమే అని చెబితే.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులెవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు అలాంటి పరిస్ధితినే ఫేస్‌చేస్తుంది టకియా.
అయినా ఈ బ్యూటీ కెరీర్ కొన్నేళ్ల కిందటే ముగిసిపోయింది. ఆమెకు ఆఫర్లు రాక సినిమాలో నటించలేదు. మరి ఆఫర్లు లేనప్పుడు వ్యక్తిగత జీవితంలో అయినా స్థిరపడాల్సింది. కానీ అలాకాకుండా.. ప్లాస్టిక్ సర్జరీ చేయించేసుకుంటే అవకాశాలు వచ్చి పడతాయని అమ్మడుకి ఎవరు చెప్పారో గానీ, తనకున్న అందాన్ని కాస్త పోగొట్టుకున్నట్టే కనిపిస్తోంది అంటున్నారు బాలీవుడ్ జనాలు. అయినా టకియాకు అంతకుముందు ఏం అందం తక్కువైందని ఈ పని చేసిందో ఏమో..?