27న భారత్ బంద్..కాంగ్రెస్ సపోర్ట్

283
bandh
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆందోళనను మరింత ఉదృతం చేయడంలో భాగంగా ఈ నెల 27న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ బంద్‌కు మద్దతు ప్రకటించింది కాంగ్రెస్.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా కేవ‌లం కొద్దిమంది రైతులే ఆందోళ‌న చేప‌డుతున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంద‌ని రైతులంతా స‌మైక్యంగా త‌మ గ‌ళం పార్ల‌మెంట్‌కు వినిపించాల‌ని యూపీలోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఆదివారం జ‌రిగిన కిసాన్ మ‌హాపంచాయ‌త్ పిలుపు ఇచ్చింది. ఈ భేటీలో 15 రాష్ట్రాల‌కు చెందిన 300కుపైగా రైతు సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. సాగు చ‌ట్టాల ర‌ద్దు కోరుతూ యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తామ‌ని అవ‌స‌ర‌మైతే 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కూ త‌మ పోరాటం కొన‌సాగిస్తామ‌ని ఎస్‌కేఎం స్ప‌ష్టం చేసింది.

- Advertisement -