విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి: హరీష్‌

142
harishrao
- Advertisement -

రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో మంగళవారం నంగునూరు మండలం ముండ్రాయి మండల ప్రాథమికోన్నత పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు.

పాఠశాల ఆవరణ ప్రాంగణం బురదమయంగా మారిందని మొరం పోయించి చదును చేయించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజను ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభం దృష్ట్యా తీసుకుంటున్న జాగ్రత్తలు, తరగతుల నిర్వహణ, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు.

భౌతిక దూరం పాటించేలా.. చొరవ చూపాలి. విద్యార్థుల చేతులు సబ్బుతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఏంకు సూచించారు.

పాఠశాలలోని మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా.. లేవా అంటూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరోనా నేపథ్యంలో పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య చర్యలు చేపట్టి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

- Advertisement -