కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎం.పి.ఆర్ గార్డెన్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ల సమక్షంలో పలువురు కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి 1500 మంది యువత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 2003లో ఈటెల పార్టీలో చేరక ముందే ఈ ప్రాంతం గులాబీ మయం అయింది. టిఆర్ఎస్ లోకి ఈటెల వచ్చి గెలిస్తే ఆయన వెంట మేము ఉన్నాం.. ఈటెల పార్టీ నుండి వెళ్లిపోతే ఎవరు వెంట వెళ్ళ లేదు. టిఆర్ఎస్ లోకి ఒక్కడే వచ్చిండు, ఒక్కడే వెళ్ళిండు అని మంత్రి ఎద్దేవ చేశారు.
మధ్యం, పైసలు పంచాల్సి వస్తే రాజకీయాల నుండి తప్పకుంటా అన్నడు ఈటల..మరి ఇప్పుడు అన్ని పంచేది ఎవరు ఈటెల రాజేందర్ కాదా. ఒక్క ఎకరం అమ్మితే ఎన్నికలు కొట్లాడుతా అని ఆనాడే చెప్పాడు. గెళ్లు శ్రీనివాస్ గెలిస్తే అభివృద్ది నియోజకవర్గం అవుతుంది. కాని ఈటెల గెలిస్తే అభివృద్ది అయితదా.. అని ప్రశ్నించారు. దొడ్డు వడ్లు కొనమని, యూరియా ధరలు పెంచుతామని, మోటార్లకు మీటర్లు పెడతామని బిజేపి అంటుంది. ఒక్క రైతు కూడ బిజెపికి ఓటు వెయ్యడు. 2014లో సిలిండర్ కు దండం పెట్టు బిజేపికి ఓటు వేయి అన్నారు. ఇప్పుడు సిలిండర్ ను తలుచుకొని టీఆర్ఎస్ కు ఓటు వేద్దాం అని హరీష్ కోరారు.
తెలంగాణలో ఎనిమిది గంటలు మాత్రమే కార్మికులు పని చేస్తారు, కాని కేంద్రం 12గంటలు పని చేపిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వాటికి అత్యధిక జీతాలు ఇస్తుంది. నల్లధనం తెచ్చి ఒక్కోక్కరి బ్యాంక్ అకౌంట్ లలో 15లక్షలు వేస్తామని మోది చెప్పాడు. నోట్ల రద్దుతో నల్ల ధనం బయటకు వస్తుందని చెప్పారు. వచ్చిన నల్ల ధనం ప్రజల ఖాతాలో వేస్తాం అన్నారు. మరి ఎక్కడ వేశారు అని మంత్రి విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మడంలో బిజెపి అభివృద్ది చెందింది. BSNL లాంటి వాటిని ప్రవేట్ పరం చేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు.. అని ముసలి పులి కథ చెప్పారు మంత్రి హరీష్ రావు.