- Advertisement -
శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తారు నుండి భారీ వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉన్నది. మధ్యాహ్నం నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉస్మాన్‌సాగర్, నానక్‌రామ్ గూడలో భారీగా వర్షం కురిసింది. ఖైరదాబాద్, నాంపల్లి, అమీర్‌పేట్, కూకట్‌పల్లిలో స్వల్పంగా వాన పడింది.
అదేవిధంగా ఉదయం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్‌లో 7.5 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా మల్లాపురంలో 5.5 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా వెలుగుపల్లిలో 5 సెంటీమీటర్లు, తుంగతుర్తిలో 5 సెం.మీ., గద్వాల జిల్లా గట్టులో 4 సెం.మీ., ఖమ్మం జిల్లా తల్లడలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.
- Advertisement -