కల్తీ లేని ఉత్పత్తుల కోసం ప్రభుత్వం కృషి- మంత్రి నిరంజన్ రెడ్డి

182
Minister Niranjan Reddy
- Advertisement -

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈరోజు టూరిస్ట్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్‌లోకి 23 విజయ ఉత్పత్తులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ బ్రాండ్ ఉత్పత్తులను ఆదరించండి కోరారు. అలాగే శుద్దమయిన ఆహారం, గాలి , నీరు కావాలి. శుద్ధమయిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. పంటల ఉత్పత్తులలో రసాయనాలు, ఎరువులను తగ్గించేందుకు రైతులను చైతన్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఇప్పుడిప్పుడే రైతులలో చైతన్యం వస్తుంది. కల్తీ లేని ఉత్పత్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తుంది. తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ టర్నోవర్ రూ.200 కోట్లు ఉన్నా ఒక్క రూపాయి కూడా లాభాల్లో లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఆయిల్ ఫెడ్ టర్నోవర్ రూ.700 కోట్లు, నికరలాభం రూ.57 కోట్లుగా ఉంది. దీనికి కారణమైన ఆయిల్ ఫెడ్ చైర్మన్, ఎండీకి, సిబ్బందికి అభినందనలు తెలిపారు మంత్రి. విభిన్నరకాల నూనెగింజల ఉత్పత్తులు, పంటల సాగుకు ఆయిల్ ఫెడ్ కృషిచేయాలి. శుద్దమయిన ఉత్పత్తులు ప్రజలకు అందించేందుకు నూనె ఉత్పత్తులతో పాటు, ఇంతక వంట పదార్థాలు ప్రజలకు చేరేలా కృషిచేయాలని మంత్రి సూచించారు.

నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు చేరాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష. సాధారణ వ్యక్తులు విజయవంతంగా వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రభుత్వరంగ సంస్థలు ఎందుకు విజయవంతం కావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయిల్ ఫెడ్ ను ప్రోత్సహించారు. గత ప్రభుత్వాలు నూనెగింజల ఉత్పత్తిని నిర్లక్ష్యం చేశారు. 22 మిలియన్ టన్నుల నూనె దేశంలో వినియోగిస్తుంటే కేవలం 7 మిలియన్ టన్నులే ఉత్పత్తి అవుతుంది. 15 మిలియన్ టన్నులు విదేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు రూ.80 వేల కోట్లు వంటనూనెల దిగుమతికి వెచ్చిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ కృషితో నూనెగింజల సాగు పెరిగింది.. కేంద్రం కూడా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు.

హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అంతటా మొక్కలు నాటి సంరంక్షింప బడుతున్నాయి. శుద్దమయిన గాలి, ఆహారం అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. మిషన్ భగీరధ పథకం కింద పట్టణాలతో పాటు గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించబడుతుంది. జెనీవా యూఎన్ఓ సదస్సు సూచనలకు ముందే కొత్త రాష్ట్రంలో మిషన్ భగీరధకు శ్రీకారం చుట్టడం జరిగింది. నీటి ద్వారా సంక్రమించే 70 శాతం రోగాలను కట్టడిచేయగలిగామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

- Advertisement -