- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు సంయుక్తంగా ఈ ప్రక్రియ చేపట్టగా మొబైల్ వాహనాలతో వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది. ఇక ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో వ్యాక్సినేషన్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించగా
వ్యాక్సిన్ కోసం వచ్చినవారితో మాట్లాడారు. కరోనా తొలి డోసును ఎందుకు వేసుకోలేదని అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఇప్పటికే 18 ఏండ్లు నిండిన వారిలో 70 శాతానికిపైగా టీకా వేసినట్లు అధికారులు తెలిపారు.
స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం మొత్తం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేశారు. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 సంచార టీకా వాహనాలు.. కంటోన్మెంట్ పరిధిలో 25 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయి.
- Advertisement -