మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా చిరు 154వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘భోళా శంకర్’ పేరును ఖరారు చేశారు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వేదాళం’ సినిమాను ‘భోళా శంకర్’ పేరుతో తెరకెక్కించనున్నారు.ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు.
‘హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు. ‘భోళా శంకర్’ టైటిల్ ను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యాన్ని, ఘన విజయాలను ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సార్’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. కాగా,శనివారం రోజు చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న లూసిఫర్ రీమేక్ టైటిల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. గాఢ ఫాదర్ అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.