ఒకే ఒక డెల్టా కేసు నమోదుకావడంతో ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. న్యూజిలాండ్‌లో లోకల్ ట్రాన్స్మిటెడ్ కరోనా కేసు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడ్రోజుల లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
ఆక్లాండ్‌లో ఓ 58 ఏండ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు తాజాగా గుర్తించారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి దేశంలో మూడ్రోజుల పాటు.. ఆక్లాండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వారం పాటు లాక్ డౌన్ విధించారు. దాదాపు 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో అక్కడి ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
గత ఆరు నెలలుగా లోకల్ ట్రాన్స్మిటెడ్ కేసులు నమోదు కానప్పటికీ.. డెల్టా వేరియెంట్‌తో ప్రమాదమున్నందున చాన్స్ తీసుకోదలుచుకోలేదని ఆమె స్పష్టంచేశారు. అలసత్వంతో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ కాలం పాటు లాక్ డౌన్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు.