- Advertisement -
ఇటీవల ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా స్వల్ప లక్షణాలున్నాయి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
- Advertisement -