ఎంపీటీసీ భర్తకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌..

215
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్‌ ఈ నెల 26న ప్రగతిభవన్‌లో దళితబంధు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈమేరకు శనివారం హుజురాబాద్‌ నియోజకవర్గంలోని దళిత నేతలకు సీఎం స్వయంగా ఫోన్ చేశారు. ఈ నెల 26న సమావేశం ఉంటుందని, ఈ సమావేశానికి రావాలని వారిని ఆహ్వానించారు. ఈ క్రమంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని తనుగుల గ్రామం (జమ్మికుంట మండలం) ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారు. దళితబంధు పథకంపై ఈ నెల 26న ప్రగతిభవన్‌లో నిర్వహించనున్న అవగాహన సదస్సుకు రావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పట్ల వ్యవహరించిన తీరును రామస్వామి సీఎం కేసీఆర్‌కు తెలిపాడు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. ఈటల రాజేందర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఈటల చిన్నవాడని వ్యాఖ్యానించారు. దళిత బంధును హుజూరాబాద్ లో అమలు చేశాక, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని రామస్వామితో చెప్పారు.

ఈ సమావేశానికి మొత్తం 427 మందిని ఆహ్వానిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను ఎంపిక చేశారు. జులై 26న మండల కేంద్రాల్లో సమావేశం కావాలని, ఆపై హుజూరాబాద్ చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి హైదరాబాద్ రావాలని వారికి వివరించారు. దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని, ప్రపంచానికి గొప్ప సందేశమిద్దామని పిలుపునిచ్చారు. దళిత బంధు పథకం పెద్ద మిషన్‌ అని, ప్రాణం పోయినా దాని అమలు నుంచి వెనక్కి తగ్గేది లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు.

- Advertisement -