బీజేపీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా..

183
narsimhulu
- Advertisement -

తెలంగాణ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి..ఈటల అవినీతి పరుడని ఆరోపించారు.అలాంటి అవినీతి పరుడిని బీజేపీలో చేర్చుకోవడం తనను బాధించిందన్నారు. నా అనుభవాన్ని బీజేపీ నేతలు పట్టించుకోలేదని తెలిపారు.

హుజురాబాద్ ప్రజలు అవినీతి పరుడైన ఈటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భూ కబ్జా చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారో చెప్పాలని…ఆయనకు అంత ఆస్తి ఎలా వచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. ఈటల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ మాత్రం అర్హుడు కాదన్నారు. ప్రజలు ఈటలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మోత్కుపల్లి…..సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు గొప్ప పథకం అన్నారు.

సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని…ఆయన తీసుకొచ్చిన దళిత బంధు పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. హుజురాబాద్ ప్రజలే కాదు అంతా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలపాలన్నారు. నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పథకాన్ని చూడలేదన్నారు. సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేశానని వెల్లడించారు. బీజేపీలో తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని తెలిపారు. ఈటల దళిత,దేవాలయాల భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ని దళిత వర్గాల నాయకుడిగా గుర్తించాలన్నారు మోత్కుపల్లి.

- Advertisement -