కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తిరిగి లాక్ డౌన్ బాటపట్టింది బంగ్లాదేశ్. నేటి నుండి ఆగస్టు 5 వరకు రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.
బక్రీద్ సందర్బంగా అనేక సడలింపులు ఇవ్వడంతో గత వారం రోజుల నుంచి కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పారామిలటరీ, ఆర్మీ, పోలీసుల పహారా ఉంటుందని అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని సూచించారు అధికారులు,.
కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రష్యాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పాటుగా ఇప్పుడు ఆ రష్యాలో గామా వేరింట్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.