టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒకవైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్‌లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.8గా ఓ చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రానికి మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో పాటు ఇటీవల విడుదలచేసిని థీమ్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబందించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో మనముందుకు వచ్చారు మేకర్స్. 2017లో వచ్చిన సూపర్‌హిట్ ఫిల్మ్ ఆనందో బ్రహ్మ సినిమాలో చివరగా తెలుగు తెరపై కనిపించింది తాప్సీ.
ఇది బౌంటీ హంటర్స్ కథ ఆధారంగా తిరుపతిలో సెట్ చేయబడిన కథ. తాజా సమాచారం ప్రకారం తాప్సి తిరుపతి కేంద్రంగా పని చేస్తున్న స్వతంత్ర జర్నలిస్టుగా కనిపిస్తుంది. ఆమె పాత్ర చుట్టూ చాలా ఆసక్తి నెలకొంటుంది. ఆమె నటన “మిషన్ ఇంపాజిబుల్” చిత్రానికి ప్రధాన హైలెట్ గా నిలవనుంది అంటున్నారు. స్వరూప్ ఇందులో డిటెక్టివ్ పాత్రలో పోషిస్తుండడం విశేషం.