నారప్ప..ముందుగానే..!

98
narappa
- Advertisement -

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నారప్ప. తమిళంలో ధనుష్ హీరోగా అసురన్‌ గా వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 20న విడుదల కానుండగా ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందించింది అమెజాన్.

అనుకున్న టైం కంటే ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. జూలై 19నే భారతీయ ప్రేక్షకుల కోసం “నారప్ప” అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాత్రి 10 గంటల నుండి ప్రసారం చేయనున్నారు. యుఎస్ఎ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఈరోజు మధ్యాహ్నం 12:30 నుండి ప్రసారం అవుతుంది.

వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుండి నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానున్న మొదటి భారీ తెలుగు చిత్రం నారప్ప.

- Advertisement -