కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు..

155
Central Cabinet committees
- Advertisement -

కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం కేబినెట్ కమిటీల్లో మార్పులు చేశారు. 8 ముఖ్యమైన కమిటీల్లో భూపేంద్ర యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా, శర్బానంద సోనోవాల్‌లకు స్థానం కల్సించింది. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌, శర్బానంద సోనోవాల్, మన్సుఖ్ మాండవియా, గిరిరాజ్ సింగ్ లకు అత్యంత కీలకమైన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సిసిపిఎ)లో స్థానం దక్కింది.

మొదటిసారి సిసిపిఎలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి స్థానం దక్కింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను 6 కమిటీల్లో నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 7 కమిటీలలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు చోటు కల్పించింది. నైపుణ్య అభివృద్ధి, ఉపాధికి సంబంధించిన కమిటీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు స్థానం దక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ నియమితులయ్యారు.

- Advertisement -