రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఐ వే బ్రిడ్జీపై ఓ కారు దగ్ధమైంది. మామిడిపల్లి నుండి బంజారాహిల్స్ కు వెళ్తుండగా అత్తాపూర్‌లో పిల్లర్ నంబర్ 135 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అదే దారిన వెల్లతున్న రవి అనే వ్యకి కారులో మంటలు చూసి తన ప్రాణాలు లెక్కచేయకుండా కారులో ఉన్న నలుగురు వ్యక్తులను కాపాడారు. కారులో మంటలు వ్యాపించడంతో భయపడి అందులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నగరశివారు రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో కారు పూర్తిగా దగ్దం అయ్యింది.
శైలేజా అనే మహిళ మామిడిపల్లి నుంచి బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్‌కు వెళ్తున్న సమయంలో అత్తాపూర్ 135 పిల్లర్ వద్ద అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగటంతో అందులో మహిళతో పాటు ముగ్గురు పిల్లలు ఇరుకు పోయారు. అదే సమయంలో మహేశ్వరం ఒక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళ సాయి సౌందరరాజన్ అదే దారిన వెళ్తుండగా వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఫైర్ ఇంజన్ రంగంలోకి దింపి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. కారులో మంటలు చెలరేగిన విషయాన్ని కారులో నుండి తమిళిసై సౌందరరాజన్ వీక్షించారు. రాజేంద్రనగర్ పోలీసులు శైలజతో పాటు ఇద్దరు కుమారులు 2 నెలల పాపను సురక్షితంగా ఇంటికి పంపించారు. ఈ ప్రమాదంలో శైలజతో పాటు ఇద్దరు చిన్నారులు పాప ప్రాణాలతో కాపాడిన రవి అనే యువకుడిని రాజేంద్ర నగర్ ఏసీపీ సంజయ్ కుమార్ , స్థానికులు ప్రశంసించారు.