ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటింస్తున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఆధునిక హంగులతో నిర్మించిన 1,320 డబుల్ బెడ్రూం ఇండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఇంట్లో పూజ కార్యక్రమాల అనంతరం లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు.
అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.అలాగే ఈ పర్యటనలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అక్కడి నుండి బయలుదేరి సర్దాపూర్‌లో సకల వసతులతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును కేసీఆర్ ప్రారంభిస్తారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. సీఎం తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.