దోనీకి మరో ఎదురుదెబ్బ..!

250
MS Dhoni Sacked as Captain of Rising Pune
- Advertisement -

ధోనీకి పుణె టీమ్ షాక్ ఇచ్చింది. కెప్టెన్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కొన్నిరోజుల్లోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -10 సీజన్ కు సంబంధించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ గా ధోనీని తొలగించారు. ఈ మేరకు పుణె యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

MS Dhoni Sacked as Captain of Rising Pune

గత ఐపీఎల్‌లో ధోనీ నేతృత్వంలోని జట్టు పేలవ ప్రదర్శన చేసినందుకు గానూ అతనిని తప్పించింది. ధోనీ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ కు పగ్గాలు అప్పగించింది పుణె టీమ్. ఐపీఎల్ -9 సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన పుణె జట్టు, కేవలం ఐదు విజయాలను మాత్రమే నమోదు చేసుకుంది. వ్యక్తిగతంగా ధోనీ ఆట తీరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. 12 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్ధ సెంచరీతో పాటు 284 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, ఐపీఎల్ -10 ప్రారంభానికి ముందే ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడం గమనార్హం.

- Advertisement -