యంగ్‌ టైగర్‌ సినిమా రెగ్యులర్ షూటింగ్..!

602
NTR new film shooting starts from feb -20th
- Advertisement -

‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ భారీ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ మూడు విభిన్న తరహా పాత్రలను పోషిస్తున్నాడు. ఇక సినిమా షూటింగ్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి తీపి కబురు అందించాడు ఎన్టీఆర్.

 NTR new film shooting starts from feb -20th

ఈ సినిమా రెగ్యులర్ షూటింగును రేపటి నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. అయితే ఎన్టీఆర్ మాత్రం పాల్గొనడంలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనపడడానికి ఫిట్ నెస్ కు సంబంధించిన కసరత్తులు చేస్తున్నాడు. అందుకోసమే ఈ యంగ్‌ టైగర్‌ ఈ వారం షూటింగ్ లొ పాల్గొనట్లేదు. వచ్చే నెల రెండో వారంలో షూటింగులో పాల్గొంటాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వారిలో ఒకరిగా రాశిఖన్నాను ఇప్పటికే ఎంపిక చేశారు చిత్ర సభ్యులు. కాగా ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే పేరు వర్కింగ్ టైటిల్ గా వుంది. మరి ఆ మిగతా ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది తెలియాల్సిఉంది.

- Advertisement -