గుప్పెడంత మనసు..వసు, రిషీల మధ్య శిరీష్ ఎంట్రీ!

314
guppedantha manasu
- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్‌ ఒకటి గుప్పెడంత మనసు. జూలై 2తో 179 ఎపిసోడ్స్‌కి ఎంటరైన ఈ సీరియల్‌ మరింత ఆసక్తికరంగా మారింది. రిషీ, రాజీవ్ మధ్య గొడవ, రిషి- వసు మధ్య శిరీష్ ఎంట్రీ వంటి ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా ముగిసింది.

తొలుత వసు కంప్లైంట్ రాస్తుండగా రాజీవ్ రావడం, ఆ లెటర్ చదివేయడం తెలిసింది. దాంతో రాజీవ్ షాక్ అవుతాడు. తర్వాత రిషీ తన తండ్రి మహీంద్రతో కలిసి కారులో వెళ్తుండగా రాజీవ్ కారు అడ్డం పెట్టి గొడవకు దిగుతాడు. చేతులు ఎత్తి మహేంద్రకు దన్నం పెడతాడు రాజీవ్. ‘ఏంటీ ఏంటిది’ అని రిషీ రగిలిపోతుంటే.. డాడ్ మీరు తనతో మాట్లాడటమేంటీ? మీ రేంజ్‌కి తను సరిపోడు.. మీరు వెళ్లి కారులో కూర్చోండి..అంటాడు రిషీ కోపంగా. వెంటనే రాజీవ్ విలన్‌లా నవ్వుతూ.. ‘అవును సార్ నేను అదే మాట్లాడదామని వచ్చాను.. మీ రేంజ్ వేరే మా రేంజ్ వేరు..సాధారణ మనుషులం. మా ఇంటి ఆడపిల్లల్ని పోలీస్ స్టేషన్‌ల చుట్టు మీరెందుకు తిప్పాలి?’ అంటాడు.

ఏయ్.. నీకు ఏం కావాలి నీ ప్రాబ్లమ్ ఏంటీ? అని రాజీవ్‌ని నిలదీస్తాడు మహేంద్ర. మా వసు డబ్బులు పోయాయి.. తను బాధపడుతుంది ఓకే. మా బాధలేవో మేము పడతాం కదా.. మీకెందుకు కడుపు నొప్పి అంటున్నాను సార్ అంటూ వసుని రెచ్చగొట్టొద్దు.. అంతగా బాగుండదు..’ అంటాడు రాజీవ్ కోపంగా చూస్తూ.ఏంటీ బెదిరిస్తున్నావా? అని రిషీ ఫైర్ కావడంతో.. ‘బెదిరించడంలేదు సార్.. సవినయంగా మనవి చేసుకుంటున్నాను.. మా వసు విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాను.. వసు మీ స్టూడెంట్.. అలానే చూడండి.. ప్రత్యేకంగా చూడకండి అని దారికి అడ్డంగా వచ్చినందుకు క్షమించండి అని వెళ్లిపోతాడు. రిషీ రగిలిపోతుంటే.. మహేంద్ర కూల్ చేసి అతడ్ని తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత వసుతో మాట్లాడిన రిషి.. దొంగపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. వసు టెన్షన్ పడుతుంటే.. రిషీ.. ‘టెన్షన్ పడకు.. ఆఫీస్ రాగానే మన ప్రాబ్లమ్ చెబుతాం’ అంటాడు. ఆ ఆఫీసర్ కారులోంచి దిగడాన్ని ఓ రేంజ్‌లో చూపిస్తారు. రిషిని పక్కనపెట్టి శిరీష్‌తో మాట్లాడుతుంది వసు. ఇక మీదట వసు, రిషీల మధ్య.. ఈ శిరీష్ ఎంట్రీలు కామన్‌గా ఉండబోతుండగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి.

- Advertisement -