మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ..

172
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. వర్చువల్‌ విధానంలోనే సమావేశం జరగనుండగా ప్రధానంగా రోడ్డు రవాణా, పౌర విమానాయశాఖ, టెలీకాం మంత్రిత్వశాఖలు చేపట్టిన పనులపై సమీక్షించనున్నట్లు సమాచారం.

ఎన్‌డీఏ కూటమి నుంచి శివసేన, శిరోమణి అకాలీదళ్‌ వైదొలగడంతో రెండు కేంద్ర మంత్రి పదవులు, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, మరో కేంద్రమంత్రి సురేష్‌ అంగడి మృతితో మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా అయ్యాయి. ఈ క్రమంలో వరుణ్‌ గాంధీ, జ్యోతిరాధిత్య సింధియాతో పాటు మరో ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం.

- Advertisement -