దళిత సాధికారిత పథకాన్ని కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభిస్తుండటం సంతోషకరం అన్నారు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బాల్క సుమన్. సోమవారం ఆయన టీ ఆర్ ఎస్ ఎల్ఫీ కార్యాలయం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు,ఎంపీ పసునూరి దయాకర్ ,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ,ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్,నోముల భగత్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. గడిచిన ఏడేళ్లలో దళితుల అభ్యున్నతికి తెలంగాణలో 55 వేల కోట్ల రూపాయలు వెచ్చించాము. దళిత సాధికారిత పథకాన్ని కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉంది. నిన్న అఖిలపక్ష సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో 11 వేల 5 వందల దళిత కుటుంబాలకు 12 వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. దళిత విద్యార్థుల కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్ససెలెన్స్ లు ఏర్పాటు చేస్తున్నాం..దళిత ఉద్యోగుల ప్రమోషన్లను పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్ణయం జరిగింది.దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు.
భూములు లేని దళిత రైతులకు కూడా రైతు భీమా అమలు చేయాలని సీఎం కెసిఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దళిత కుటుంబాల సమగ్ర సర్వే చేసి లబ్దిదారుల ఎంపిక జరగనుంది. పల్లె ,పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో దళిత వాడల్లో ప్రత్యేక పర్యటనలు ఉంటాయని తెలిపారు. దళిత జాతి చరిత్రలో నిన్నటి మీటింగ్ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. పదకొండు గంటల పాటు సీఎం కెసిఆర్ చిత్తశుద్ధితో ఈ సమావేశాన్ని నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిలో సీఎం కెసిఆర్ ఎలాంటి చిత్తశుద్ధిని ప్రదర్శించారో దళితుల ఉద్ధరణకు అలాంటి చిత్తశుద్ధిని చూపుతున్నారు. అంతకు ముందు అనేక మంది సీఎం లు వచ్చి పోయినా సీఎం కెసిఆర్ లా దళితుల అభివృద్ధికి ఇంతలా ఆలోచించలేదు అని బాల్క సుమన్ కొనియాడారు.
దళితులకు కల్యాణ లక్ష్మి ద్వారా 1420 కోట్ల రూపాయల మేర లబ్ది జరిగింది. ఇక ఎస్సీ హాస్టల్ ల సంఖ్యను 870 కి పెంచాం..దళిత విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల మొత్తాన్ని భారీగా పెంచాం…అంబెడ్కర్ ఓవర్సీస్ విద్యానిధితో వంద కోట్ల రూపాయల మేర లబ్ది జరిగింది. ఆరు వందలకు పైగా దళిత విద్యార్థులకు ఈ పథకంతో మేలు జరిగింది. కులాంతర వివాహాలు చేసుకున్న దళితులకు ప్రోత్సాహక మొత్తాన్ని భారీ గా పెంచామన్నారు. దళిత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా 13 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతోంది .ఎస్సీ స్పెషల్ డెవెలప్ మెంట్ పథకానికి చట్ట రూపం ఇవ్వడంతో నిధుల మల్లింపు జరగడం లేదు..దళితులకు ఏడేళ్లలో 16 వేల ఎకరాలను ఉచితంగా పంపిణీ చేశామని ఎమ్మెల్యే బాల్క అన్నారు.
అలాగే ఎకానమీ సపోర్ట్ స్కీం ద్వారా వేలాది దళిత కుటుంబాలకు మేలు జరిగింది.దళిత విద్యార్థుల కోసం 238 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు నెలకొల్పాం…దళిత విద్యార్థులపై ప్రభుత్వం పెట్టే ఖర్చు భారీగా పెరిగింది..గత ఏడేళ్లలో దళితుల గురుకుల విద్యాసంస్థల కోసం 4438 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చుపెట్టింది..ఏడు లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది..ఈ ఏడేళ్లలో తీసుకున్న నిర్ణయాలకు తోడు సీఎం కెసిఆర్ తాజాగా ప్రకటించిన దళిత సాధికారికత పథకం దళితుల జీవితాల్లో కొత్త వెలుగు ప్రసాదిస్తుంది..సీఎం కెసిఆర్ చిత్రపటాలకు తెలంగాణ అంతటా దళితులు పాలాభిషేకం చేస్తున్నారు..తెలంగాణ దళిత జాతి పక్షాన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు అని బాల్క తెలిపారు..సీఎం కెసిఆర్ వెంటే దళిత జాతి ఉంటుంది అన్నారు.
రాష్ట్రప్రభుత్వం తరపున రీసెర్చ్ స్కాలర్ లకు స్టైఫండ్ ఇచ్చే విషయాన్నీ కూడా సీఎం కెసిఆర్ పరిశీలిస్తామనడం సంతోషం అన్నారు. ఇక బీజేపీ ది ఎపుడూ దళిత వ్యతిరేక భావ జాలమే..కాంగ్రెస్ కు దళితులు ఓట్లేసే యంత్రాలు గానే కనిపిస్తారు అని బాల్క విమర్శించారు. అంబెడ్కర్‌కు కాంగ్రెస్ భారత రత్న కూడా ఇవ్వలేదు.కాంగ్రేస్ కు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదు. రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. కాంగ్రెస్ మునిగి పోతున్న పడవ…కాంగ్రెస్ కు ఎవ్వరూ పీసీసీ ప్రెసిడెంట్ అయినా ఒరిగేది ఏమీ లేదు..కాంగ్రెస్ లో అపుడే అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎద్దేవ చేశారు.
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యే గా కెసిఆర్ అక్కడ ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెట్టారు. ఆ పథకాలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పెట్టారు..ఏ సీఎం లూ కెసిఆర్ లా ఆలోచించ లేక పోయారు అన్నారు. రాష్ట్రమంతా సీఎం కెసిఆర్‌ను దేవుడిలా చూస్తోంది. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. దళితుల కోసం దేశంలో చిత్తశుద్ధితో పని చేస్తున్న ఏకైక సీఎం కెసిఆర్. తెలంగాణ దళిత సంక్షేమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారడం ఖాయమన్నారు.
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ నిర్వహించిన దళితుల సమావేశం చారిత్రాత్మకమైంది. దళిత సాధికారికత పథకం మిషన్ భగీరథ,మిషన్ కాకతీయల్లా గొప్ప పేరు తెచ్చుకోవడం ఖాయం..దళిత జాతి సీఎంకు రుణపడి ఉంటుంది..ప్రతీ దాన్ని విమర్శించడం కొన్ని దళిత సంఘాలకు తగదు అని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.