తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల..

152
TS Inter 2nd year Results 2021
- Advertisement -

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసారు..కరోనా కారణంగా పరీక్షల్ని రద్దు చేసింది ప్రభుత్వం.. మొదటి సంవత్సరం ప్రాతిపధికన ద్వితీయ సంవత్సరం మార్కులను కేటాయించారు. పరీక్ష ఫీజు కట్టిన వారందర్ని ఉత్తీర్ణులుగా ప్రకటించింది ఇంటర్ బోర్డు.

తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబిత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. వందకు వంద శాతం ఉత్తీర్ణత సాదించారని తెలిపింది. సెకండ్ ఇయర్‌లో 4,51,585 మంది పరీక్ష ఫీజు చెల్లించిన వారందరు ఉత్తీర్ణులుగా పరిగణించింది.. అందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు..మొత్తం ఉత్తీర్ణత సాదించిన వారిలో 1,76,719 మంది ఏ గ్రేడ్, 1,04,886 మంది బీ గ్రేడ్, 61,887 మంది సీ గ్రేడ్, 1,08,093 డీ గ్రేడ్ సాధించారు.. ఫలితాలు సాయంత్రం నుండి అందుబాటులో ఉన్నాయి.. మొదటి సంవత్సరం ప్రాతిపదికన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం ఫలితాలను కేటాయించారు.. ఒకవేళా విద్యార్థులకు ఈ ఫలితాలు నచ్చకపోతే విద్యార్థులు పరీక్షలు రాయలనుకుంటే కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన ఒక్కో సబ్జెక్టులోని మార్కులు సెకండ్ ఇయర్‌లో కూడా అదేవిధంగా వేసినట్టు తెలిపింది ఇంటర్ బోర్డు. గతంలో ఫెయిల్‌ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా పాస్ మార్కులు వేస్తూ ప్రకటించింది. ప్రాక్టికల్స్ విషయంలో గరిష్ట మార్కులు అంటే సెకండ్ ఇయర్ బైపీసీలో 120 ఎంపీసీలో 60 గరిష్ట మార్కులు వేస్తూ ఫలితాలు విడుదల చేసింది. మెమోలో ఏవైనా తప్పులు దొర్లితే ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు 040- 24600110 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.

పదో తరగతి,ఇంటర్ ఫలితాలు కూడా ఇప్పటికే రద్దయ్యాయి. ఇటు ఇంటర్ సెకండ్ పరీక్షలు ఇతర రాష్ట్రాలు రద్దు చేస్తున్న కారణంగా కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం మార్కుల క్రైటీరియా ఖరారు చేసేందుకు కొద్దిరోజులుగా ఇంటర్ బోర్డ్ ఏర్పాట్లు చేసుకుంది. దీనిపై ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చి ఫలితాలను నేడు విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డ్.

- Advertisement -