- Advertisement -
నేటి నుంచి యూఏఈకి ఎయిరిండియా విమానాలు నడవనున్నాయి. ఏప్రిల్ 24న కరోనాతో యూఏఈ..భారత ప్రయాణీకులపై ఆంక్షలు విధించడంతో విమాన సర్వీసులను నిలిపివేశారు. సరిగ్గా రెండు నెలల తర్వాత భారత్‌లో పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో విమానసర్వీసులను పునరుద్దరించారు.
ఇప్పటికే దుబాయ్ నుంచి భారత్‌కు విమానాలు నడుస్తున్నాయి. అయితే భారత్ నుంచి వెళ్లే విమానాలపై మాత్రం నిషేధం ఉంది. యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలు, ఎంపిక చేసిన గోల్డెన్ వీసా హోల్డర్లను మాత్రమే ఇండియా నుంచి యూఏఈకి తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.
- Advertisement -