- Advertisement -
జమ్ము కశ్మీర్‌కు చెందిన 14 మంది నేతలతో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్‌లోనె తదితరులు ఈ భేటీకి హాజరుకానున్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ నేతలతో తొలిసారి ప్రధాని సమావేశం నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ ప్రాంతాల్లో 48 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు.
- Advertisement -