కళ్యాణలక్ష్మి,షాది ముబారక్ దేశానికి ఆదర్శం- మంత్రి కొప్పుల

358
Minister Koppula Eshwar
- Advertisement -

కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వైశ్య భవన్ వేదికగా 61మంది కి కళ్యాణ లక్ష్మీ రూ.61,82,192/-, 35 మంది సీఎంఆర్‌ఎఫ్‌ రూ.11,10,500/- విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది. నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం వివిధ కారణాల వల్ల అనారోగ్యం పాలైన టువంటి వాళ్ళు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్నటువంటి 35 మంది లబ్ధిదారులకు 11,10,500 విలువ గల చెక్కులను మంత్రి పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత, ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గొస్కుల జలేంధర్, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ ముస్కు లింగాల రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ ఛైర్మన్ గంగాధర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్, సింగిల్ విండో జిల్లా ఫోరం అధ్యక్షులు రాజ సుమన్, సింగిల్ విండో ఛైర్మన్ మాధవరావు పాల్గొన్నారు.

- Advertisement -