మావోలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అనారోగ్యంతో మృతిచెందారు. ఛత్తీస్ గఢ్ సుకుమా జిల్లాలో మీనా గుట్ట ప్రాంతంలో ఆయన మరణించగా తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దులో అంత్యక్రియలు నిర్వహించారు.
యాప పాపమ్మ, రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో నారాయణ పెద్ద కుమారుడు. నర్సంపేటలో డిగ్రీ చదివిన ఆయన 1985 – 90 మధ్యకాలంలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా, ఐటీడీఏ మైనర్ ఇరిగేషన్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పీపుల్స్‌వార్ దళంలోకి వెళ్లాడు. పీపుల్‌వార్‌లో చేరిన హరిభూషణ్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దళసభ్యుడిగా, మిలిటరీ ప్లాటూన్ శిక్షణ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర కార్యదర్శి, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగారు. హరిభూషణ్‌పై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డు ప్రకటించింది.