‘మా’ అధ్యక్ష బరిలో జీవిత రాజశేఖర్..

114
maa elections
- Advertisement -

మరోసారి సాధారణ ఎన్నికలను తలపించేలా కనిపిస్తున్నాయి మా అధ్యక్ష ఎన్నికలు. ఇప్పటికే మా బరిలో ఉంటామని ప్రకాశ్‌ రాజ్, మంచు విష్ణు ప్రకటించగా తాజాగా తాను సైతం పోటీచేస్తానని వెల్లడించారు జీవిత రాజశేఖర్. దీంతో మా లో తీన్‌మార్‌ నెలకొంది.

తనకు కృష్ణంరాజు, కృష్ణ మద్దతు ఉందంటూ మంచు విష్ణు ఇప్పటికే ప్రకటించగా.. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని నాగబాబు బలపరుస్తున్నారు. దీంతో ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి.

2019 ఎన్నికల్లో శివాజీరాజా, నరేష్ ప్యానల్‌ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇప్పుడు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్‌ల మధ్య పోటీతో మరోసారి ‘మా’ లో ఆసక్తికరమైన పోరు నెలకొంది.

- Advertisement -