హీరో గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. గోపిచంద్, నయనతార కాంబినేషన్, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని నిర్మాత రమేష్ తెలిపారు.
తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా
సాంకేతిక విభాగం
దర్శకుడు: బి గోపాల్
మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ
ఫొటోగ్రాఫర్: బాలమురగన్
స్రిప్ట్ రైటర్: వక్కంతం వంశీ
డైలాగ్స్: అబ్బూరి రవి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడ్యూసర్: తాండ్ర రమేష్