వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరు మార్పు: సీఎం కేసీఆర్‌

152
- Advertisement -

సోమవారం సీఎం కేసీఆర్‌ వ‌రంగ‌ల్ పర్యటించారు. ఇందులో భాగంగా వరంగల్‌ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును మార్చుతున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతామ‌ని సీఎం పేర్కొన్నారు.

ఈరోజు ప్రారంభించుకున్న క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని హ‌న్మ‌కొండ జిల్లాగా ప‌రిగ‌ణించాలి. దీనికి స‌మీపంలో నిర్మించ‌బోయే క‌లెక్ట‌రేట్‌ను వ‌రంగ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా ప‌రిగ‌ణించాలి. పేరు మార్పున‌కు సంబంధించిన ఉత్త‌ర్వులు రెండు, మూడు రోజుల్లోనే వ‌స్తాయ‌ని సీఎం తెలిపారు. అధునాత‌న జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌న‌వాన్ని ప్రారంభించుకోవ‌డం ఆనందంగా ఉంది అని సీఎం కేసీఆర్ తెలిపారు.

వ‌రంగ‌ల్ నాయ‌కులు, ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు బాగా తెచ్చుకున్నాం. అవ‌న్నీ ప‌రిపుష్టం కావాలి. అప్పుడే అనుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి. ప్ర‌భుత్వం అంటే ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌న‌ప్పుడే నిజ‌మైన ప‌రిపాల‌న అని అన్నారు. ప‌నులు వేగంగా జ‌రిగితేనే ప్ర‌జాస్వామ్యం విజ‌య‌వంత‌మ‌వుతుంది అని సీఎం కేసీఆర్ చెప్పారు.

- Advertisement -