మంత్రి హరీశ్‌కు తప్పిన ప్రమాదం…

115
- Advertisement -

మంత్రి హరీష్ రావు కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వస్తుండగా ఆయన కారుకు ప్రమాదం జరిగింది. హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డుగా రాగా ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో పైలట్ కారును మంత్రి హరీష్ రావు వాహనం ఢీకొంటింది. ఈ ప్రమాదంలో ముందు కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రి హరీష్ రావుకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

- Advertisement -