కొవిడ్ నిబంధనలు పాటించకుంటే త్వరలోనే భారత్ కు మూడో దశ కరోనా ముప్పు వచ్చే అవకాశం ఉంది. వచ్చే 6నుంచి 8 వారాల వ్యవధిలోనే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపు తర్వాత ప్రజల సమూహాలు పెరిగాయి.ఇప్పటివరకు కేవలం 5% జనాభా మాత్రమే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు.
ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొవిడ్ నిబంధనలు కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందన్న రణదీప్ …కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచటంతో పాటు ఆయాప్రాంతాల వరకు లాక్‌డౌన్ విధించాలని సూచించింది.
మూడో దశ పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందని చెప్పటానికి ఇప్పటివరకు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు.కరోనా నియంత్రణ చర్యలపై కఠినమైన పర్యవేక్షణ అవసరమని వెల్లడించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా.