ఎమ్మెల్సీ కవితను కలిసిన‌ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు…

170
kavitha mlc
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం ఎమ్మెల్సీ కవితని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ‌పలు సమస్యలను ప్రస్తావించగా, మంత్రి పువ్వాడ అజయ్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ ‌కవిత హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి కృతజ్ఞతలు తెలిపిన వేములవాడ కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల బలోపేతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు, సర్పంచ్ ల‌ గౌరవ వేతనాన్ని 30% పెంచినందుకు గాను, వేములవాడ నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవితను హైదరాబాద్ లో కలిసి ‌కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వంలో జరగని‌ విధంగా, టీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు ‌జరుగుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్‌ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ ప్రతిభను గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించింది. ఈ‌రోజు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత గారిని, నిక్కత్ జరీన్ తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎంతో కష్టపడి బాక్సింగ్ లో ప్రపంచస్థాయికి ఎదిగిన నిక్కత్ జరీన్, యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అంతేకాదు ‌నిక్కత్ జరీన్ ను‌ క్రీడలవైపు ప్రోత్సాహించిన తల్లిదండ్రులు ‌పర్వీన్, జమీల్ లను‌ సైతం ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,సాట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -