హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరికి చెందిన సుషీల్ కుమార్ గైక్వాడ్, 32 ఏళ్ళ యువకుడు, మరియు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ బాడీబిల్డర్ సుషీల్ కుమార్ గత నెల (ఏప్రిల్) చివరి వారంలో కరోనా వైరస్ బారిన పడి సాధారణ జ్వరం, దగ్గుతో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అక్కడ సాధారణ కోవిడ్ చికిత్స ప్రారంభించినప్పటికి దురదృష్టవశాత్తు అతని ఆరోగ్య పరిస్థితి క్రమంగా చాలా క్షీణించింది. అత్యంత తీవ్ర కోవిడ్ వ్యాధి బారినపడి విషమ పరిస్థితిలో మలక్ పేట్ యశోద హాస్పిటల్‌కు తీసుకురావడం జరిగింది. మిస్టర్ సుషీల్ కుమార్, మే 19,2021న మా అత్యవసర విబాగానికి రాగానే అతన్ని కాపాడటానికి అతనికి వెంటిలేషన్ మరియు అదనపు కార్పోరియల్ ఊపిరితిత్తుల మద్దతు (ECMO) అవసరమని స్పష్టమైందని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి తెలిపారు.
కరోనా రోగులలో ముక్యంగా రోగి ఊపిరితిత్తులలో ఉండే వైరస్ తీవ్రతను (CTస్కోరు)ను బట్టి రోగి ఆరోగ్య పరిస్థితి అంచన వేస్తారు. ఇతనిలో అత్యంత ప్రమాదకరంగా CT స్కోరు 25/25 వైరస్ తీవ్రత, 80% మేర ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినట్లు తేలింది. సాదారణంగా కరోనా చికిత్సలో అత్యంత కీలకమైన సమయం 4-6 వారాలు, తరువాత ECMO మీద ఆధారపడి ఉంటుంది మరియు కొంతమందిలో ఊపిరితిత్తుల మార్పిడి అవసరం కూడా ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిపుణులైన మా క్రిటికల్ కేర్ బృందం మరియు అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ లు అతని అవసరాలకు అనుగుణంగా అతనికి తగిన చికిత్స అందించగలిగామన్నారు.
అతను యశోద హాస్పిటల్ కు రావడానికి ముందు కరోనా కారణంగా అతని ఊపిరితిత్తులకు విస్తృతమైన నష్టం జరిగింది. అధిక ఆక్సిజన్ అవసరాలతో అతని అనారోగ్యం క్లిష్టమైన దశలో వెంటిలేటర్‌పై ఆధారపడి ఉన్నాడు. ముఖ్యంగా ఈ చికిత్స సమయంలో అతడికి వెంటిలేషన్, ప్రోనింగ్, ప్రారంభ ట్రాకియోస్టోమీ, మార్గదర్శక-ఆధారిత అత్యాధునిక వైద్యంతో పాటు ఇంట్యూబేషన్ మరియు మెకానికల్ వెంటిలేషన్ అవసరమయ్యాయి. చికిత్స యొక్క రెండవ వారం ముగిసే సమయానికి మేము అతనిని వెంటిలేటర్ నుండి విజయవంతంగా తోలగించగలిగాము. అని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి తెలియజేశారు.
అతని అంతర్లీన ఫిట్‌నెస్ లేదా సంకల్ప శక్తి కారణంగా ECMO మద్దతు అవసరం లేకుండానే సుషీల్ అద్భుతమైన రికవరీ కనబరిచాడు. అతను ఫిజియోథెరపీకి పూర్తిగా సహకరించాడు మరియు మా అద్భుతమైన ఇంటెన్సివ్ కేర్ అలాగే నర్సింగ్ సంరక్షణకు అతనిలో మంచి పురోగతి కనిపించింది. క్రమంగా ఐసియు నుండి స్టెప్‌డౌన్‌కు తరువాత కనీస ఆక్సిజన్ మద్దతుతో గదికి విజయవంతంగా మార్చడం జరిగింది. లక్షణాలు ప్రారంభమైనప్పటి నుండి సుదీర్ఘకాలం (ఒక నెల కన్నా ఎక్కువ కాలం) ట్రీట్మెంట్ తరువాత తన సాదారణ జీవితంలోకిరావడం సంతోషించాల్సిన విషయం. అని యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్. విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ అన్నారు.
ఆనారోగ్యం, చిన్న వయస్సు మరియు అతని క్రీడా నేపథ్యం తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు మిస్టర్ సోనూ సూద్, ఏ విధంగానైనా సుషీల్ కుమార్ కు సహాయం చేయాలనే ఉద్దేశంతో మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్స్ మలక్ పేట్ కు తీసుకురావడంలో సోనూ సూద్ చేసిన సహాయం కూడా చాలా గొప్పదని, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి తెలిపారు.