దేశం కోసం అవసరమైతే త్యాగం చేయడమే ఫ్లయింగ్ అధికారుల ధ్యేయమని ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా అన్నారు. శనివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకామడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్‌గార్డ్‌లో ఐదుగురు కెడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న శిక్షణ పూర్తి చేసుకున్న కెడెట్లు పాల్గొన్నారు. పరేడ్‌ను చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా సమీక్షించారు. ఈ సందర్భంగా కెడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్, నావిగేషన్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వింగ్స్, బ్రెట్స్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా బదౌరియా మాట్లాడుతూ… దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సరిహద్దుల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. కరోనా రెండో దశ వేళ ఆక్సిజన్ సరఫరాలో వైమానికదళం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. కాగా, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 20,500 గంటల ఫ్లయింగ్ శిక్షణను ఈ బ్యాచ్ పూర్తి చేసిందన్నారు. వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డుగా ఐదుగురు క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించారు. బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులుగా ఉండటం మంచి పరిణామమని తెలిపారు. ఫ్లయింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.