తెలంగాణలో 1,417 కరోనా కొత్త కేసులు..

147
covid
- Advertisement -

తెలంగాణలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో రెండు కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,546 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,10,834 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,88,259 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,029 చికిత్స పొందుతున్నారు.

- Advertisement -