దేశవ్యాప్తంగా లక్ష మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు: మోదీ

143
modi
- Advertisement -

స్కిల్ ఇండియాలో భాగంగా కోవిడ్ 19 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం క్రాష్ కోర్సును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ… దేశ‌వ్యాప్తంగా సుమారు ల‌క్ష మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌ను త‌యారు చేయాల‌న్న ఉద్దేశంతో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందని వెల్లడించారు.

జూన్ 21వ తేదీ నుంచి 45 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో అదే రీతిలో గుర్తింపు ఉంటుంద‌న్నారు. కోవిడ్‌19 క్రాష్ కోర్సు మూడు నెల‌ల పాటు ఉంటుంద‌ని, శిక్ష‌ణ పొందిన వారు కోవిడ్ పోరాటంలో అందుబాటులో ఉంటార‌ని ప్ర‌ధాని అన్నారు.

గ‌డిచిన ఏడేళ్ల‌లో వైద్య విద్య‌, కొత్త ఎయిమ్స్ బిల్డింగ్‌ల నిర్మాణం, వైద్య క‌ళాశాల‌లు, న‌ర్సింగ్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వీటిల్లోచాలా వ‌ర‌కు ప్రారంభం అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. గ్రామాల్లో ప‌నిచేస్తున్న‌ ఆశా, ఏఎన్ఎమ్‌, అంగ‌న్‌వాడీ, హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల పనితీరును అభినందిచారు మోదీ.

- Advertisement -