కొత్త ఐటీ చట్టాలు తెచ్చిన దగ్గరి నుండి ట్విట్టర్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్‌కు ఉత్తరప్రదేశ్ పోలీసులు లీగల్ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్టర్ మేనేజింగ్ ఎడిటర్ మనీశ్ మహ్వేశ్వరిని ఆదేశించారు పోలీసులు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తి సూఫీ అబ్దుల్ సమద్‌పై జరిగిన దాడి విషయంలో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాడి ఆరోపణలకు సంబంధించిన వీడియోను కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా థర్డ్ పార్టీ కంటెంట్‌ను కలిగి ఉందని, దాన్ని తొలగించలేదంటూ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు.
గత నెలలో ఢిల్లీ స్పెషల్ పోలీసుల బృందం ‘కాంగ్రెస్ టూల్‌కిట్’ వ్యవహారంలో మనీశ్ మహేశ్వరిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.