ఉద్యోగుల భద్రతపై ట్విట్టర్ ఆందోళన!

74
twitter

భారత్‌లో ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఐటీ రూల్స్‌ తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనిపై స్పందించిన గూగుల్ భారత చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలపగా తాజాగా ట్విట్టర్ సైతం స్పందించింది. కొత్త రూల్స్ ను పాటించేందుకు ప్రయత్నిస్తామని… కాకపోతే కొత్త విధానాలతో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది.

పబ్లిక్ చర్చల్లో మా సర్వీసు కీలక పాత్ర పోషిస్తుందని, మహమ్మారి సమయంలో మా మాధ్యమం ప్రజలకు అండగా ఉందని రుజువైంది. అలాంటి సేవలను అందుబాటులో ఉంచడం కోసం కొత్త చట్టాలను పాటించేందుకు ప్రయత్నిస్తాం అన్నారు. .

కొంతకాలంగా భారత్‌లో మా ఉద్యోగులకు హాని కలిగేలా సందర్భాలు వచ్చాయి. మేమెప్పుడూ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల తరపునే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా పాటించాల్సిన నియమాలనే అనుసరిస్తున్నాం అని తెలిపింది ట్విట్టర్.