- Advertisement -
రాష్ట్రాలకు వ్యాక్సినేషన్ పంపిణీ కొనసాగుతుందని వెల్లడించింది కేంద్రం. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 56లక్షలకుపైగా మోతాదులు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
గురువారం ఉదయం 8 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వ్యర్థాలతో సహా 25,10,03,417 మోతాదులు వినియోగించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 26,55,19,251 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రాలు, యూటీల వద్ద 2,18,28,483 మోతాదులు అందుబాటులో ఉన్నాయని … ఇప్పటి వరకు 27,28,31,900 మోతాదులను కేంద్రం ఉచితంగా సరఫరా చేసిందని పేర్కొంది.
- Advertisement -