కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

152
Prime Minister
- Advertisement -

కేంద్ర కేబినెట్ కీలక సమావేశం ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు వర్చువల్‌ విధానంలో సమావేశం జరుగనుండగా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. థర్డ్ వేవ్ వ్యాపిస్తుందన్న హెచ్చరికలతో కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలతో పాటు లాక్ డౌన్ విషయంలో కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

లాక్ డౌన్ కారణంగా దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు చాలా దెబ్బతిన్నాయి. దేశ జీడీపీ మైనస్‌లోకి పడిపోతుందన్న ఆందోళనను ఆర్థిక వేత్తలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది.

దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -