దేశంలో గ్రీన్ ఫంగస్ కలకలం..

153
green fungus
- Advertisement -

దేశంలో గ్రీన్ ఫంగస్ కలకలం సృష్టించింది. తొలిసారిగా మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఓ వ్యక్తిలో గ్రీన్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. అరబిందో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 34 ఏళ్ల వ్యక్తి పరీక్షలు చేయగా.. సైనస్, ఊపిరితిత్తుల్లో ఫంగస్‌ జాడలు కనిపించాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

వెంటనే అతన్ని ముంబైలోని ఓ హాస్పిటల్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం కొవిడ్‌ అనంతర లక్షణాలతో మళ్లీ ఆసుపతిలో చేరాడు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు చేయగా.. ఊపిరితిత్తులు, సైనస్‌లో ఆస్పెర్‌గిలోసిస్ ఫంగస్‌ను గుర్తించారు. ఉపిరితిత్తుల్లో 90శాతం ఇన్ఫెక్షన్‌ జరిగిందని, ఆ తర్వాత అతన్ని చార్టర్డ్‌ విమానం ద్వారా తరలించగా.. ఇప్పుడు హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్ బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమన్నారు.

- Advertisement -