గోడౌన్ల నిర్మాణంపై సీఎస్ రివ్యూ..

90
somesh
- Advertisement -

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో గోడౌన్ల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అధికారులతో మంగళవారం బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గోడౌన్ల నిర్మాణాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తగు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గోడౌన్ల నిర్మాణాలకు సంబంధించి భూమి ఇతర సమస్యల విషయమై జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, TSCOB చైర్మన్ రవీందర్ రావు, TSCOB ఎండి, మురళీధర్, నాబార్డ్ GM (Retd), ఇంచార్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -