భరత మాత ముద్దుబిడ్డ, ధేశ రక్షణ కోసం చైనా సరిహద్దుల్లో విరోచితంగా పోరాడి శత్రు సేనల్లో గుండెల్లో సింహ స్పప్నమై నెలకొరిగిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు కు మరో గౌరవం దక్కింది.
ఆయన ఆమరత్వాన్ని భావి తరాలకు అందించేలా, ఆయనలోని దేశభక్తి, అంకిత భావం నేటి యువతలో అనుక్షణం స్పూర్తిని నింపేలా ప్రభుత్వం ఆయన పుట్టిపెరిగిన గడ్డ సూర్యాపేటలో పదడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నది..ఈ రోజు ఆయన వర్దింతి సందర్భంగా మంత్రి కెటీఆర్, స్దానిక ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డి , సంతోష్ బాబు తల్లి దండ్రులు ఉపేందర్ గుప్త, మంజుల, సతీమణి సంతోష, చేతుల మీదుగా కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు…….వీర మంణం చెంది దేశ ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిల్చిపోయిన సంతోష్ బాబు వీరత్వాన్ని చాటుతూ సూర్యాపేట లోని కోర్ట్ చౌరస్తాకు సంతోష్ బాబు చౌరస్తగా నామకరణం చెసి అక్కడే విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు…… విశాలమైన లాన్ నిర్మించి ల్యాండ్ స్కేపింగ్ చేయించి , తీరొక్క పూల మెక్కల్ని నాటి కోర్ట్ చౌరస్తాను అందంగా తీర్చి దిద్దింది ప్రభుత్వం……విగ్రహాన్ని జెఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో తయారు చేయించారు.
పదడుగుల ఎత్తులో చేతిలో మువ్వన్నెల జాతీయ జెండా పట్టుకోని ఠీవాగా, హుందాతనంతో , జాతి గౌరవం ప్రతిభింభించేలా సంతోష్ బాబు విగ్రహాన్ని తయారు చేశారు……వీర మరణం చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కెసీఆర్ సూర్యాపటలో పరామర్శించారు… 5 కోట్ల రూపాలయల్ని , వారి సతీయణి సంతోషకు డిఫ్యూటీ కలెక్టర్ ఉద్యోగం, హైద్రాబాద్ లో నివాస స్దలం అందించిం గౌరవించారు… .. ముఖ్యమంత్రి కెసీఆర్ అధేశాలతో అంత్యక్రియల రోజే మంత్రి జగదీష రెడ్డి కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా అని నామకరణం చేసి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని జగదీష్ రెడ్డి ప్రకటించారు.
ఇచ్చిన మాట నిలుపుకుంటూ మంత్రి సంవత్సరం తిరగే లోపే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు… స్వయాన మంత్రి కెటీఆర్ చేతుల మీదగా విగ్రహావిష్కరణ చేస్తుండటంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు….. సంతోష్ బాబు కుటుంబానికి అన్ని వేళళా అండగా ఉంటూ కొండంత భరోసాను , ధైర్యాన్ని అందించిన ముఖ్యమంత్రి కెసీఆర్ కు సంతోష్ బాబు కుటుంబ సభ్యులు ధన్యావాదాలు తెల్పుతున్నరు…..ఇప్పటికే సంతోష్ బాబు త్యాగాన్ని , శౌర్యాన్ని, గుర్తించి దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన మహావీర చక్ర అవార్డ్ ను కేంద్రం ప్రకటించింది.