మలేరియా నివారణకు రాష్ట్రంలో ఫ్రై డే..డ్రై డే

275
dmho
- Advertisement -

రాష్ట్రంలో 24 గంటల్లో 1511 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరొనా కేసులు తగ్గుతున్నాయి …ప్రస్తుతం 8వేల ఆక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 1.36 పాసిటీవీటి రేటు ప్రస్తుతం ఉంది…రాష్ట్రంలో బెడ్ ఆక్యుపెన్స్ తగ్గిందన్నారు. గడిచిన 20 రోజుల్లో 16లక్షల వ్యాక్సిన్ వేశాం… సూపర్ స్పెడర్స్ కు వ్యాక్సిన్ దాదాపు పూర్తి అయిందన్నారు.

ప్రతి రోజు 2లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నాము.. జూన్ నెలలోనే 1కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు టార్గెట్‌ పెట్టుకున్నామన్నారు. 9లక్షల వ్యాక్సిన్ లు స్టాక్ ప్రభుత్వం దగ్గర ఉంది….ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. ఆయా హాస్పిటల్స్ కి నోటీసులు ఇచ్చాము…సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది.…తెలంగాణ రాష్ట్రంలో మలేరియా చాలా వరకు తగ్గిందన్నారు.మలేరియా నివారణకు ఫ్రై డే డ్రై డే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని…థర్డ్ వేవ్ వస్తోంది అన్న నమూనాలు ఏమిలేవు. ఎవ్వరూ ఆందోళన చెందొద్దు…థర్డ్ వేవ్ కోసం తెలంగాణ వైద్యశాఖ- ప్రభుత్వం సిద్ధంగా ఉంది.బ్లాక్ ఫంగస్ వ్యాధికి తెలంగాణ స్వతహాగా మందులు తయారు చేసిందన్నారు.థర్డ్ వేవ్ పై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు.సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసిన వ్యక్తుల పై పోలీస్ కేసులు పెడుతున్నాము.ఓ టివి ఛానల్ లో జరిగిన డిబేట్ లో ఓ కెమికల్ ఇంజినీర్ థర్డ్ వేవ్ గురించి ఏ అర్హతతో మాట్లాడతాడు ,అయిన పైన పోలీస్ లకు ఫిర్యాదు చేశామన్నారు.

- Advertisement -